Monday, August 13, 2007

బాపుగారి "శ్రీభాగవతం"

రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై,శ్రవణాలంకతియై,గళాభరణమై, సువర్ణ కయూరమై, ఛవిమత్కంకణమై, కటిస్థలి నుదంచత్ఘంటయై, నూపుర ప్రవరంబై, పాదపీఠమై, వటుడు దా బ్రహ్మాండము నిండుచోన్

వామనుడు మూడో అడుగు కోసం పాదం మోపడానికై విశ్వరూపం దాల్చుతున్నప్పుడు పోతన చేసిన వర్ణన ఇది. మొదట రవి వమనునికి గొడుగు లాగ శిరస్సు దగ్గర వుంది. తరువాత కిరీటం అయింది. చెవికి అలంకరణగా చెవిపోగులా కనిపించింది. గొంతుదగ్గర హారం అయింది. నదుముకి వడ్డణం, తదుపరి చేతికి కంకణం చివరికి పాద పీఠమైంది.
( ఇది నా సొంత తాత్పర్యం. తప్పులుంటే మన్నించగలరు.)
బాపు గారి శ్రీభాగవతం లో పై వర్ణనను కల్లకు కట్టినట్లుగా చూపించారు. పై తాత్పర్యాన్ని నేను కేవలం వామనావతారం ఎపిసోద్ చూసి వ్రాసానంటే అది ఎంత బాగా చూపించారొ అర్థం చేసుకోవచ్చు.

Sunday, August 12, 2007

గోదావరి

స్త్రీవాదం రాజకీయం హాస్యం ఫాక్షనిజం కోపం అలక ప్రేమ త్యాగం అందం ఆప్యాయం పెద్దరికం ఆహ్లాదం నాట్యం భక్తి సంగీతం కెరీర్ అవినీతి పొగరు సాహిత్యం తెలుగుదనం అసూయ ...


ఇన్ని ఉన్న గోదావరి కి ఉత్తమ చిత్రం రాక పోవతం ఒకింత బాధ కలిగించింది. పోనీలే, బంగారు నంది వస్తుందని ఆశిస్తూ ...


గమనిక: బొమ్మరిల్లు కూడ చాల చక్కగా ఉంది. కాని, బొమ్మరిల్లు గోదావరి, రెండింతినీ పోల్చిటే, గోదావరికే నా ఓటు.

శంకర్ దాదా జిందాబాద్

తెలుగు ప్రేక్షకులారా .... మేల్కొనండి! మేల్కొనడమే కాదు, మా రాంబాబుగాడి కామెంట్ వింటే, వాడి ఎముకలు విరగ్గొడతారేమొ. మా రాంబాబు ఎవరంటె, నేను వాడు, ఒకే ఊరి వాళ్ళం. ప్రస్తుతం భాగ్యనగరంలో జీవనం సాగిస్తున్నాం. మొన్న ఆదివారం వాడు శంకర్ దాదా జిందాబాద్! సినిమా చూసి వచ్చాడు. చిరంజీవి అభిమానిగా వాడు బాగాలేదని చెప్పలేదు గాని, మొత్తానికి వాడి response ని బట్టి, అంతగ బాగాలేదని అర్ధం అయింది. మాటల్లో, ఈ సినిమా మాతృక లగేరహో మున్నాభాయ్ కీదీనికీ పోల్చటం మొదలుపెట్టాం. " ప్రభు దేవా చేసిందల్లా, scene by scene సీన్ అనువదించాడు. అసలు తెలుగు సినిమా కి ప్రభు దేవా ని దర్శకునిగా ఎంచుకోవటంలో ముఖ్య ఉద్దేశ్యం అదేనేమో " అని. ఇది అయినతరువాత మొన్న బుధవారం ఫోన్ చేసాడు. ఒక సినీ పత్రిక లో వార్త. " శంకర్ దాదా జిందాబాద్! చిత్ర నిర్మాణం లొ మేము మాతృకను పూర్తిగా అనుసరించాము. పాటలను మాత్రం చిరంజీవి గారి అభిమానులను ఉద్దేశించి కొద్దిగా మార్చాము ". మా రాంబాబు ఇది చదివి వినిపించి అంటాడూ, " మన చిరంజీవి అభిమనులంటె, సమాజసేవకులు అనుకున్నాను. అంగాంగప్రదర్శనల్తో వెనక నర్తించే వారు ఉంటెనే, హీరొయిన్ బొడ్డు చూపిస్తేనే, సినిమా చూడరని అనుకొలేదు.". తెలుగు ప్రేక్షకులారా .... మేల్కొనండి! మేల్కొని తెలుగు ప్రేక్షకులు ఇంతగా దిగజారలేదని నిరూపించండి.

Thursday, August 2, 2007

పిల్లల పేర్లు

పుష్య
ప్రహ్లాద్
మను
అక్షత్
భువస్
ఓం
ఆర్య
అత్రి
అచింత్య
మహిర్
శ్రేయస్
మౌర్య
అక్షర
హాసిత్
సువిత్
సారస్వత్
కిషన్

నా కొడుక్కి పేరు పెట్టడం కోసం తయారు చేసిన చేసిన చిట్టా(list) ఇది. బ్లాగు మొదలు పెట్టగానె ఏమి వ్రాయాలో తెలియక ... :)

కరతలామలకం

బ్లాగు గురించి తెలిసిన దగ్గరినించీ, ఎదో వ్రాయలన్న తపన మొదలు అయ్యింది. blogspot.com లో ఖాతా తెరిచాను. కాని ఏ పేరు పెట్టాలి? "రవి" కొసం చూసాను. దొరకలేదు. "తేట తెలుగు" లేదు. "కరతలామలకం" అన్న పదం చిన్నప్పుదు ఎప్పుదో విన్నట్లు గుర్తు. ఈ పదం ఎందుకో అచ్చ తెలుగు పదంలా వుంటుంది. నాకు తెలిసినంత వరకు దీని అర్థం "అర చేతిలొ ఉసిరి కాయ", అంటే అర చేతిలొ ఉసిరి కాయ ని పట్టుకొవదం ఎంత సులభమో, అని. కాని, నాకు, ఈ పదం తెట తెలుగు తియ్యదనానికి ఒక ప్రతీక గా వుంటుంది, అనిపించి ఈ పేరు పెట్టాను.